calender_icon.png 19 April, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీలకు వైద్య పరికరాల బహూకరణ

18-04-2025 12:11:54 AM

మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): చెన్నైలోని కెరీర్ ట్రీ హెచ్‌ఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా కంపెనీలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు అందజేశాయి. డెలివరీ బెడ్లు, బేబీ వార్మరులు, బయో కెమిస్ట్రీ ఎనలైజర్లు, సెల్ కౌంటర్ మెషిన్లు వంటి పరికరాలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి ఉమా గౌరీ కి ఆయా కంపెనీల ప్రతినిధులు అందజేశారు.

ఈ సందర్భంగా పి హెచ్ సి లలో అవసరాలు గుర్తించి వైద్య పరికరాలు అందజేసిన కంపెనీలకు డిఎం అండ్ హెచ్ ఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సత్యవతి, కార్యాలయ సూపరింటెండెంట్ మహమ్మద్ సలీం, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం అధికారిని మంజుల రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.