calender_icon.png 11 February, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు ల్యాప్‌టాప్ ల అందజేత

11-02-2025 06:27:28 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు మంగళవారం పట్టణానికి చెందిన పాత అనిత భాస్కర్ దంపతులు రూ.80 వేల విలువగల రెండు ల్యాప్‌టాప్ లను అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. విద్యార్థులకు హిందూ ధర్మము, దేశ సంస్కృతిని నేర్పించే పాఠశాలకు సేవ చేయడానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. పాఠశాల కార్యదర్శి కొడిప్యాక విద్యాసాగర్ మాట్లాడుతూ... దాతల సహకారంతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి, పాఠశాల ఉపాధ్యక్షులు సూరం లక్ష్మీనారాయణ, బాల ప్రశాంత్, ఎలుక వెంకటేష్, నల్మా సంతోష్, సరస్వతి శిశు మందిర్ పాఠశాలల అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ పాల్గొన్నారు.