అందజేసిన డీసీసీబీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): ఇటీవల ఖమ్మంలో వదర ప్రభావంతో నష్టపోయిన నిర్వాసితులకు సాయం అందించేందుకు డీసీసీబీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ముందుకు వచ్చారు. సీఎం సహాయనిధికి విరాళంగా రూ.1.51 కోట్ల చెక్కు ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొన్నారు.