21-04-2025 10:29:40 PM
భద్రాచలం(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయానికి సోమవారం ప్రముఖ సంఘ సేవకులు లయన్ గాదె మాధవ రెడ్డి సదా లత కుటుంబం ద్వారా ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థుల కోసం సుమారు రూ.25వేల విలువచేసే పుస్తకాలను లైబ్రరీ జానీకి అందజేశారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ జానీ మాట్లాడుతూ గతంలో 2016, 2018లో మాధవ రెడ్డి తల్లిదండ్రుల పేరు మీద బుక్స్, ఐదు ఫ్యాన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా లైబ్రరీకి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం సదా లత కుటుంబం ద్వారా సుమారు రూ.25 వేల ఇంజనీరింగ్ బుక్స్ ఇప్పించటం ఎంతో సంతోషకరమని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గాదే మాధవ రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ గా వీఆర్వోలుగా గ్రూప్3, గ్రూప్ 4గా అలాగే అన్ని రకాల సంస్థలలో గత పది సంవత్సరాలలో ఉద్యోగాలు పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయంలో పాఠకులు, పట్టణవాసులు పాల్గొన్నారు.