calender_icon.png 25 December, 2024 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం

04-08-2024 12:08:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమో రియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, టీఎన్‌జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) ఆధ్వర్యంలో మెహదీ నవాబ్‌జంగ్ క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో శనివారం అన్నదానం నిర్వహిం చారు. టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కస్తూరి వెంకట్ సమక్షంలో 500 మంది నిరుపేద రోగుల సహాయ కులకు అన్నదానం చేశారు. ఈ సంద ర్భంగా కస్తూరి వెంకట్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పేరు మీద సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న ముజీబ్.. ప్రతీనెల నాలుగు సార్లు పేదలకు అన్న దానం చేయడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో కేంద్ర సంఘం స్పోర్ట్స్ సెక్రటరీ బొల్లిగిద్ద శంకర్, జిల్లా నాయకులు కేఆర్ రాజ్‌కుమార్, ఖాలేద్ అహ్మద్, వైదిక్ శాస్త్రి, ఏపీఆర్‌ఓ మొహ మ్మద్ వహీద్, ఆసుపత్రి సభ్యులు శివకు మార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.