05-03-2025 01:03:43 AM
పెనపహాడ్, మార్చి 4 : పేద విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం ఓ దాత తన వంతుగా ఆర్ధిక సహాయం అందించి దాత్రుత్వం చాటుకున్నారు. మండలం లోని దోసపహాడ్ ప్రాథమికోన్నత పాఠశాల లో బ్లాక్ బోర్డు అవసరనిమిత్తం ఇదే పాఠశాల హెఎం పిండిగ నాగమణి -నర్సయ్య దంపతులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా పాఠశాల లో బ్లాక్ బోర్డు ఏర్పాటుకు అవసరమయ్యే నగదు రూ. 15000 అందజేశారు.
ఈకార్యక్రమంలో రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మామిడి వెంకన్న, సీనియర్ ఉపాధ్యాయులు రాయి కింది వెంకటేశ్వర్లు, ఆదర్శ పాఠశాల చైర్మన్ పందిరి రేణుక వీరస్వామి, ఉపాధ్యాయులు విజయ కుమారి, వై వెంకన్న, విప్లవ కుమార్ తదితరులు ఉన్నారు.