24-04-2025 05:40:47 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో నిర్మిస్తున్న కంఠమ మహేశ్వరుని ఆలయ నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పంపిన 25 వేల రూపాయలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి బిఆర్ఎస్ నాయకులు తాటికొండ సీతయ్య గుండ గాని రాములు మట్టపల్లి శ్రీశైలం గౌడ సంఘం నాయకులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేవాలయ నిర్మాణంతో ఐక్యత పెంపొతుందని అన్నారు.
ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వర్దెల్లి లింగయ్య, వర్దేళ్లి సత్యనారాయణ, వర్దేల్లి మహేష్, వర్థెల్లి శ్రీకాంత్, వర్దెల్లి వీరభద్రం, గుండ గాని సందీప్, గుండగాని నారాయణ, సైదులు, బిక్షం, మల్లయ్య, వీరయ్య, వెంకన్న, హరీష్, గణేష్, లక్ష్మయ్య, కృష్ణ, వెంకన్న, స్వామి, బిఆర్ఎస్ నాయకులు సింహాద్రి, నిరంజన్ రెడ్డి, ఉప్పలయ్య, కరుణాకర్, కేశవరెడ్డి, సత్యనారాయణ, లింగయ్య, మహేష్, పాపయ్య, కృష్ణయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.