20-03-2025 05:21:15 PM
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి మండలంలోని గుమ్మల్లపల్లి తాజా మాజీ సర్పంచ్ కంకణాల లత భక్కి రెడ్డి దంపతులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చీటూరి మహేష్ గౌడ్ తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణ కమిటీ సభ్యులు శ్రవణ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.