calender_icon.png 6 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయ నిర్మాణానికి విరాళం

06-02-2025 12:27:24 AM

 చేవెళ్ల , ఫిబ్రవరి 5 : చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు.

బుధవారం తంగడిపల్లి గ్రామానికి చెందిన వడ్డె చంద్రయ్య ఆలయ నిర్మాణంలో తన వంతు సహకారంగా రూ.51 వేల ఐదు రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అంజేశారు.

ఈ సందర్భంగా వడ్డె చంద్రయ్యను ఆలయ కమిటీ తరపు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనూష సత్తయ్య గౌడ్, రాములుగౌడ్, చంద్రయ్యగౌడ్, సుధాకర్‌గౌడ్, నారాయణరెడ్డి, ఎం.రవీందర్ గౌడ్, ఎం.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.