calender_icon.png 7 April, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 వేల విరాళం అందజేత

07-04-2025 04:52:38 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో దుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం బీఆర్ఏస్ బీసీ సేల్ మండల అధ్యక్షుడు మామిండ్ల శ్రీశైలం యాదవ్ రూ.10వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో దుర్గమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయ పునర్నిర్మాణానికి తనవంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రసాద్, నర్ర స్వామి, అయిలయ్య గౌడ్, నర్ర శ్రీను, పసుల కిషన్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.