23-02-2025 07:55:34 PM
కుల మతాలను సంప్రదాయాలను గౌరవించాలి...
ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): కుల మతాలకతీతంగా ఒకరి సాంప్రదాయాలు, ఆచారాలను మరొకరు గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఈదమ్మ గుడికి నూతన నిర్మాణానికి 50,116 రూపాయల విరాళం శివరాత్రి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోనే కులమత బేధాలు లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం ఉంటుందన్నారు. ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని ఎలాంటి విభేదాలు లేకుండా సామరస్యంగా అందరి పండుగలను సాంప్రదాయాలను గౌరవించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య, మాజీ ఉపసర్పంచ్ కుంభం యాదగిరి రెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొందు రవి, ఇరుగుదిండ్ల బిక్షం, బొందు స్వామి, పులకరం రాములు, మంటిపల్లి శంకర్, శివరాత్రి యాదయ్య, శివరాత్రి వెంకన్న, సింగపంగ ముత్తయ్య ఉన్నారు.