calender_icon.png 19 April, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమంలో అన్నదానలు చేయడం అభినందనీయం

16-04-2025 05:06:00 PM

సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ...

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో చిలుకూరు మండల పరిధిలోని రామాపురం కట్టకొమ్ముగూడెం గ్రామానికి చెందిన వేమూరి శ్రీనివాసరావు-రాణి దంపతుల కుమారుడు వేమూరి యశ్వంత్ చౌదరి ప్రధమ వర్ధంతి సందర్భంగా శ్రీనివాసరావు దంపతుల ఆర్థిక సహకారంతో ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. అన్నదానం పుణ్యకార్యం అని సందర్భం ఏదైనా సంతోషమైనా, బాదైనా, వారి కుటుంబాల్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా నిరాదరణకు గురై దిక్కు మొక్కు లేని అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు ఇలా ఒకరోజు వారికి కడుపునిండా పట్టెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం సంతోషమని ఇలా ఆశ్రమాలలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరు స్పందించి అండగా నిలవాలని, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న తమ కుమారులు అకాలమరణం చెందిన నేపధ్యంలో, వారి పిల్లల జ్ఞాపకార్థం, ఇలాంటి పుణ్యకార్యాలు చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలిగేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మిగిలిన వారికి ఆదర్శంగా నిలవడం అభినందనీయం అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.