మంచిర్యాల (విజయక్రాంతి): హజీపూర్ మండలం గుడిపేట టీజిఎస్పి 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకట రాములు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐఆర్సిఎస్ (ఆనంద నిలయానికి) అనాథాశ్రమానికి నిత్యవసర సరుకులు సోమవారం సాయంత్రం అందజేశారు. ఏఆర్సీ శిక్షణలో ఉన్న కంపెనీ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాలలోని ఆనందనిలయంలో నిత్యవసరాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ వెంకట రాములు మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ తమకి కలిగిన దాంట్లో తోచిన విధంగా సేవా గుణం అలవరచుకోవాలని, అది ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కాళిదాసు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.