25-04-2025 01:21:12 AM
భద్రాచలం ఏ ఎస్ విక్రాంత్ సింగ్
భద్రాచలం, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని భ ద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ సింగ్ అన్నా రు. గురువారం భద్రాచలంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్సీ విక్రాంత్ సింగ్ మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేస్తే ముగ్గు రు ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా సికిల్ సెల్ ఎనిమి యా వ్యాధితో బాధపడుతున్న 357వ సారి రక్తం ఎక్కించుకుంటున్న టి. సంపత్, 286వ సారి రక్తం ఎక్కించుకుంటున్న జి ఇందు, 36 9వ సారి రక్తం ఎక్కించుకుంటున్న ఎన్.శివ కుమారి, 272వ సారి రక్తం ఎక్కించుకుంటున్న క్రాంతి కిరణ్ లకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరపున బట్టలు మరియు పోషకాహారం అందించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. ఎల్.కాంతారావు, తిప్పన సిద్ధులు, డా ఎ.చంద్ర ప్రసాద్, రొటేరియన్ అబ్రహం, వై. సూర్యనారాయణ, జి. రాజారెడ్డి, పల్లంటి దేశప్ప, డాక్టర్ వి వై. భాను ప్రసాద్. గొల్ల భూపతిరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.