10-04-2025 02:12:50 AM
ఖమ్మం, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ):-ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడమంటే ప్రాణదానం చేసిన ట్లేనని ఎస్ ఆర్ బి జి.ఎన్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా అన్నారు. బుధవారం కళాశాల ఐ.క్యూ. ఏ.సి-జువాలజీ,ఎన్. ఎస్.ఎస్, ఎన్.సీ.సి.,ఖమ్మం లయన్స్ క్లబ్, ప్రభుత్వ ఆసుపత్రి రక్తానిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు రక్త దానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకన్నా రక్త దానం ఉన్నతమైనదని అభిప్రాయపడ్డారు.
వివిధ విభాగాల విద్యార్థులు 70vమంది స్వ ఛ్చందంగా రక్త దానం చేసినందుకు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలోవైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి,ఐ.క్యూ.ఏ.సి కోఆర్డినేటర్ -జువాలజి విభాగాధిపతి డా.ఎం.సునంద, ఎన్.ఎస్. ఎస్.జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎన్.శ్రీనివాసరావు,కళాశాల పీ.ఓలు, డా.ఎం.పిచ్చయ్య, డా. ఎం.కార్తీక్, డా.సుజిత్ రెడ్డి, ఎన్.సి.సి ఆఫీసర్ డా.ఓంకార్, ఆసుపత్రి రక్త నిధి ఇంఛార్జ్ డా.ఎల్. సందీప్ కుమార్, లయన్స్ క్లబ్ కార్యదర్శి డా.బొల్లికొండ శ్రీనివాస రావు, జువాలజీ అధ్యాపకులు డా.శ్రీనివాస్ శరీన్, డా.కవిత , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు