calender_icon.png 22 January, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోచ్ ఆర్గనైజేషన్‌కు రూ.31 వేల విరాళం..

22-01-2025 07:45:09 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ ఎండి ఖాదర్ షరీఫ్ హైదరాబాదుకు చెందిన సోచ్ ఆర్గనైజేషన్ కు రూ.31 వేల చెక్కును అందజేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ... ఈ విరాళం పాఠశాల విద్యార్థులు, తమ సామాజిక బాధ్యతగా, సమిష్టిగా సేకరించిన నిధుల ద్వారా అందించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు యూసుఫ్ షరీఫ్, యాకూబ్ షరీఫ్, ఉపాధ్యాయులు వెంకట్, రవితేజ తదితరులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఈ కార్యక్రమానికి విశేషంగా సహకరించారన్నారు.