సిరిసిల్ల, జనవరి 13 (విజయ క్రాంతి ): దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివద్ధి కోసం దాతలు విరాళాలు ఇవ్వాలని రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి మహా పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ వీపులు ఆది శ్రీనివాస్ వడ్లూరి లక్ష్మణు లతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సీజన్ లో కూడా పుష్కలమైన వర్షాలు పడి, ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో, ప్రజలంతా సుఖ సంతోషా లతో బాగుండాలని రాజన్ననుమొక్కుకున్నామన్నారు.రైతన్న బాగుంటేనే అందరూ బాగుంటార ని, వేములవాడ అభివద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారన్నారు.
స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటు నాది ,ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడమన్నారు. ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని గుర్తు చేశారు.రూ.35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియజరుగుతుందన్నారు.
అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే రూ.20 కోట్లు ఉన్నాయన్నారు.దానిని వంద కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది,ఈ ప్రాంత ప్రజలదన్నారు.అన్నదాన సత్రం కోసం మా కుటుంబ సభ్యులు ,మా అన్నదమ్ములు కలిసి రూ.40 లక్షలు ఆ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామన్నారు.
రాజన్న భక్తులుగా డోనర్స్ ఉంటే విరాళాలు ఇవ్వాలనికోరుతున్నామని,దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వాలాని,స్థానిక శాసన సభ్యులు, ఈవో నీ కలిసి కూడా విరాళాలు ఇవ్వచ్చు అన్నారు.రాజన్న అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి విరాళాలు ఏవి ఇచ్చిన సరేనని,రైతులు బియ్యం, కూరగాయలు కూడా ఇవ్వచ్చన్నారు.
అన్ని పార్టీల వాళ్లు ఎవరెవరు ఆర్థికంగా ఉన్న ఆ దేవాలయానికి వెచ్చిస్తే సంతోషమన్నారు.వేములవాడ దర్శనంలో కోడె టికెట్ ,అభిషేకం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నామాన్నారు.తిరుపతి లాగ అందరికీ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు కానీ టికెట్ తీసుకోవలన్నారు. ఆలయాన్ని అభివద్ది చేయాలని వీఐపీ ప్రోటోకాల్ దర్శనం చేసుకునే వారు టికెట్ తప్పకతీసుకోవాలన్నారు.బ్రేక్ దర్శనం ఆల స్యం లేకుండా త్వరగా జరుగుతుందన్నారు.
మహా శివరాత్రి కి సంబంధించి ఇప్పటికే శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారని,శ్రీశైలం లో ఉన్న తరహాలోని మ్యూజికల్ ఫౌంటెన్ వేములవాడలో లార్డ్ శివ ఉండేలా చేస్తున్నామన్నారు. ధర్మపు రి నుండి ఏసీ బస్సు స్టార్ట్‌అయిందని,వేములవాడ నుండి కూడా ఏసీ బస్సు ప్రారంభించ డంతోపాటు బస్టాండును పూర్తిస్థాయిలో అభివద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు పొన్నం ప్రభాకర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.