calender_icon.png 15 January, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలకు విరాళం.. నెట్‌ఫ్లిక్స్‌లో సెగ

28-07-2024 04:06:50 AM

  1. ‘కమల’కు ఓటీటీ సహ వ్యవస్థాపకుడు భారీ విరాళం 
  2. తప్పుపడుతున్న అమెరికన్లు

వాషింగ్టన్, జూలై 27: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు నిరసన సెగ తగిలింది. ‘బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్’ అన్న హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహ్యారిస్‌కు ఓటీటీ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టిం గ్స్‌కు ౭౦ లక్షల డాలర్లు విరాళంగా ఇవ్వడాన్ని అమెరికన్లు తప్పుబడుతూ నెట్‌ఫ్లిక్స్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ ప్రచారానికి పెద్దఎత్తున విరాళం ఇవ్వ డం చరిత్రలో మొదటిసారని మండిపడుతున్నారు. ‘నేను గతంలోనే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నా. మీరూ వెంటనే రద్దు చేసుకోండి’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘నెట్‌ఫ్లిక్స్ ఒక్కటే కాదు. మనకు ఎన్నో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏం చేయాలో మీకు తెలుసు. మీరంతా ట్రంప్‌కు మద్దతివ్వాలి’ అని మరొకరు పోస్ట్ చేశాడు. 

ఉపాధ్యక్షురాలిగా విఫలం

ఉపాధ్యక్షురాలిగా కమల పెద్ద ఫెయిల్యూర్. దేశంలోకి అక్రమ వలసలను అడ్డు కోలేకపోయారు. ఆమె గెలిస్తే చరిత్రలో అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారు’ అం టూ కమలపై ఫ్లోరిడాలో జరిగిన ‘ది బిలీవర్స్ సమ్మిట్’లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విరుచుకుపడ్డారు. వామపక్ష డెమోక్రాట్ల సెనేటర్ జాబితాలో కమల మొదటి స్థానంలో ఉంటారన్నారు. ఆమె ఎన్నికల్లో గెలిస్తే వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారన్నారు. వారినే న్యాయమూర్తులుగా నియ మిస్తారన్నారు. కమలకు ఎన్నికల్లో పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. బైడన్ తప్పుకున్న తర్వాత కమలా హ్యారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.