20-04-2025 06:06:08 PM
చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని నవాబుపేట గ్రామంలో గ్రామస్తులంతా ఏకమై శివుడి గుడి(Shiva temple) నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయ నిర్మాణానికి కాల్వ రాజారెడ్డి దైవభక్తితో రూ.1,11,116 లు విరాళంగా అందజేశారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి ఆయనను ఆదివారం కలిశారు. నరేష్, బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి, కాల్వ సమ్మిరెడ్డి, బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు, చెక్క నర్సయ్య, సర్వ శరత్, తీగల నాగరాజు, అనగాని రాజయ్య, తిప్పణవేణి రవి, చింతనిప్పుల మధు, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.