21-04-2025 12:27:14 AM
స్నేహ ఫామ్స్ డైరెక్టర్ రామేశ్వర్ రెడ్డి
అడ్డాకుల ఏప్రిల్ 20 : అన్ని దానాల కన్నా రక్త దానం మహా గొప్ప దానమని స్నేహ ఫామ్స్ డైరెక్టర్ రామేశ్వర్ రెడ్డి అన్నారు. జాతీయ వాలంటీర్ గుర్తింపు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అడ్డాకుల సమీపంలోని స్నేహ ఫామ్స్ లో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామేశ్వర్ రెడ్డి స్వయంగా రక్త దానం చేసి ఉద్యోగుల్లో స్పూర్తి నింపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రక్త దానం ప్రాణ దానంతో సమానం అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రక్తదానం చేయడం వలన ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడ గలుగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, స్నేహ ఫామ్స్ డైరెక్టర్ రామేశ్వర్ రెడ్డి, మేనేజర్ ఓబుల్ రెడ్డి , ఫామ్స్ సిబ్బందికి రెడ్ క్రాస్ ప్రతి నిధులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త బాబుల్ రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.