వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనపై ట్రూత్ సోషల్ సైట్ లో ట్రంప్ వెల్లడించారు. తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఏదో తేడాగా ఉందని అదర్థమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు వెల్లడించారు. తన చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైందని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. తనపై జరిగిన ఘటనపై స్పందించిన ట్రంప్ గాడ్ బ్లెస్ అమెరికా అని సోషల్ మీడియా సైట్ లో ట్వీట్ చేశారు. దుండగుడు జరిపిన ఆర రౌండ్ల కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తక్షణమే ట్రంప్ ను వేదికపై నుంచి తరలించారు. దుండగుడి కాల్పలుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చాయి.