calender_icon.png 21 April, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ ఉడుంపట్టు

15-03-2025 12:00:00 AM

జన్మతః పౌరసత్వం రద్దు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై తాను జారీ చేసిన దేశాలను ఫెడరల్ కోర్లు నిలిపివేయడాన్ని సవాలు చే స్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలయిన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికి పరిమితం చేయాలని యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ సారా హారిస్ తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అయితే ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమా, కాదా అన్న విషయంపై న్యాయస్థా నం అభిప్రాయాన్ని ఆమె కోరకపోవడం గమనార్హం. ట్రంప్ అమెరికా అ ధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే (జనవరి 20న) ఈ జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశంపై సంతకాలు చేశారు.

అయితే ట్రంప్ ఆదేశాలు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో  పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మసాచుసెట్స్, మేరీల్యాండ్, వాషింగ్టన్ కోర్టులు ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో ఫిబ్రవరి 19నుంచి అమలు కావలసిన ఈ ఆదేశాలకు బ్రేక్ పడింది. అయితే కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా దేశవ్యాప్తంగా అమ లు చేయాల్సిన ఆదేశాలను నిలపుదల చేయడం సరికాదని సారాహారిస్ సుప్రీంకోర్టులో వాదించారు. కాబట్టి ఇది అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడ పౌరసత్వం లభిస్తుంది.

అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. వందల ఏళ్లు గా ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే ఈ సదుపాయం దుర్వినియోగం అవుతోందని, దీనికి బ్రేకులు వేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.అందుకే అధికారంలోకి వచ్చీ రాగానే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒక వేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినా, తల్లి తాత్కాలిక వీసాపై అమెరికాలో ఉంటున్నా ఇదే నియమం వర్తిస్తుంది. 

ఇదే ఇప్పడు అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 2024 చివరినాటికి 54 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.7 శాతం భారతీయులే. వీరిలో 34 శాతం మంది అమె రికాలో పుట్టిన వారు కాగా మిగతా వాళ్లు వలస వచ్చిన వారు. వీరిలో చాలామంది ఏళ్ల తరబడి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నా శాశ్వత పౌరసత్వం రాని వాళ్లే. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదు రు చూస్తున్నవాళ్లే. వీళ్లలో కొందరు అక్కడి వాళ్లను వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలు గనుక అమలయితే భా ర్యాభర్తలు విడిపోవలసిన పరిస్థితి.

ఇక నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు అమెరికా పౌరసత్వం లభించడం దా దాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకున్నారు. ఇలాంటి వాళ్లు పిల్లల పౌరసత్వం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ బంగారు భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన భారతీయులు ఎదుర్కొంటున్న చిక్కు సమస్యలు. ఇప్పటికే పార్ట్ టైమ్ ఉద్యోగాలపై నిషేధం విధించడంతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు ఇది కొత్త చిక్కు. అయితే ట్రంప్ ఆదేశాలు అమలు కావడం అంత సులభం కాదన్న న్యాయనిపుణుల అభిప్రాయాలే వీరికి తాత్కాలిక ఊరట.