వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యంలో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. పదవీ బాధ్యతలు చేపట్టగానే వలసలపై కొరడా ఝుళిపించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ నుంచి అక్రమ వలసదారులను తరమికొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్నట్లు సమాచారం. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. దేశంలో అక్రమ వలసలపై దృష్టి పెట్టాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. తన పరిపాలనలో దేశ సరిహద్దులను పర్యవేక్షించడానికి కఠినమైన ఇమ్మిగ్రేషన్ అధికారి టామ్ హోమన్‌ను తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. "మాజీ ఐసీఇ డైరెక్టర్, బోర్డర్ కంట్రోల్‌లో స్టాల్వార్ట్ టామ్ హోమన్, మన నేషన్స్ బోర్డర్స్ ("ది బోర్డర్ జార్") ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరబోతున్నారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను" అని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.