calender_icon.png 20 April, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తులను నమ్మవద్దు

11-12-2024 01:08:55 AM

*ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, డిసెంబర్ 10 (విజ యక్రాంతి): ప్రభుతం నుంచి వచ్చే పథకాల లబ్ధి కోసం మధ్యవర్తులను నమ్మవద్దని ఎమ్మెల్యే పాయల్ శంక ర్ సూచించారు. ఎవరికి ఒక రూపా యి సైతం ఇచ్చే అవసరం లేదని, సంక్షేమ పథకాల ఫలాలు పొందడం లబ్ధిదారుల హక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం అదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు చెందిన 191 మంది లబ్ధిదా రులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.