మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీ వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్‌వేదికగా ఆయన స్పందించారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందన్నారు.
పని ఒత్తిడి, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదన్నారు. ములుగు జిల్లాలో ఎస్సు, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సు , కానిస్టేబుల్, తాజాగా సిద్దిపేటలో కానిస్టేబుల్, మెదక్ కొల్చారంలో హెడ్ కానిస్టేబుల్ స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖా దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరారు. సమస్యలకు పరిష్కారాలు ఉంటాయని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని పోలీసులను ఉద్దేశించి పేర్కొన్నారు.