calender_icon.png 18 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పిదాలకు తావివ్వొద్దు

18-01-2025 01:37:24 AM

*  కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి జనవరి 17 (విజయక్రాంతి):  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం కోసం క్షేత్రస్థాయిలో  సర్వే నిర్వహిస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

శుక్రవారంవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు భరోసా, రేషన్ కార్డుల సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ దేశ్య , వ్యవసాయ అధికారి సుధా రాణి,  తుర్కపల్లి ఎంపీడీవో ఝాన్సీ బాయ్, శ్రీ ఉమా, బొమ్మలరామారం తహసీల్దార్  శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.