calender_icon.png 24 January, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలంటే భయమొద్దు

24-01-2025 01:40:27 AM

* ఇంటర్ విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నంబర్

* 14416 లేదా 1800 

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరగనున్నాయి. దీంతో విద్యార్థులకు పరీక్షలంటే ఆందోళన, ఒత్తిడి, భయం ఈ సమయంలో వెంటాడుతుంది. ఇలాంటి వారికోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు టెలీమానస్ సేవలను తీసుకొచ్చింది.

14416 లేదా 1800 914416 టోల్ ఫ్రీ నంబర్‌లను అం దుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలంటే ఆందోళన, బెరుకు, భయం ఉన్నవారు ఈ నంబర్‌కు ఉచితంగా ఫోన్ చేసి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సలహాలు, సూచనలు తీసుకోవ చ్చని బోర్డు తెలిపింది.