సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట (విజయక్రాంతి): కొండపాక వాస్తవ్యులు ఒకప్పటి దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆదివారం మృతి చెందారు. రామచంద్ర రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. 1983-88 లో అప్పటి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంతో నిబద్దతతో, ప్రజా సేవలో ఉన్నారని, తన సేవలు నేటి తరం రాజకీయ నాయకలకు ఎంతో స్ఫూర్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే అయినా తన తుది శ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని ప్రజా సేవకు పరితపించారని, తన సేవలు నియోజకవర్గ ప్రజల్లో చిరస్తాయిగ నిలుస్తాయన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేసుకురాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.