సింగపూర్,(విజయక్రాంతి): ప్రపంచ చెస్ చరిత్రలో దొమ్మరాజు గుకేశ్ సరికొత్త రికార్డు సాధించారు. పిన్నవయస్కుడై గుకేశ్ ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా రికార్డు సాధించారు. చెస్ 14వ గేమ్ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ పే ను గుకేశ్ ఓడించి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంత్ తర్వాత 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా రెండో భారతీయుడు గుకేశ్ విజయం సాధించి భారత్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేశారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్ 2012లో భారత్ నుచి గెలిచి 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. 2013 తర్వాత తొలి భారతీయుడిగా దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుకేశ్ కుటుంబం తమిళనాడులో సెటిల్ అయింది. తండ్రి రజనీ సర్జన్ కాగా, తల్లి పద్మ గృహిణి. గుకేశ్ నాలుగో తరగతి తర్వాత చెస్ పట్ల ఆకర్షితుడై దానిని నేర్చుకోవడం ప్రారంభించారు.