15-11-2024 12:24:57 AM
న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రధాని మోదీకి ఇవ్వనున్నట్టు గురువారం ప్రకటించింది. వచ్చేవారం గయానాలో జరిగే ఇండియా సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. కొవిడ్ సమయంలో భారత్ అందించిన సహకారానికి గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి మోదీ కృషి చేశారని వివరించింది.