calender_icon.png 26 February, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేసీదారు మద్యం లభ్యం

26-02-2025 06:32:35 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలో దేసీదారు రవాణా చేస్తున్న వ్యక్తిని  ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. రూ.18 వేల విలువగల దేసీదారు మద్యం స్వాధీన పర్చుకుని కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సిఐ రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర నుండి కాగజ్ నగర్ కు దేసీదారు మద్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టగా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన అబ్దుల్ సోహైల్ స్కూటీపై దేశదారును తరలిస్తుండగా 90 ఎం ఎల్ క్వాంటిటీ గల 400  సీసాలు స్వాదినపర్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీలల్లో ఎస్.ఐ.లు లోభానంద్, ఐ. సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.