calender_icon.png 20 April, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమలవాగును మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలి

19-04-2025 12:46:18 AM

1405 ఎకరాల్లో 11 గ్రామాల రైతులకు లబ్దిచేకూరుతుంది 

ఎమ్మెల్యే పాయంకు కాంగ్రెస్ నేతలు,రైతుల వినతి

బూర్గంపాడు,ఏప్రిల్18(విజయక్రాంతి):బూర్గంపాడు మండల పరిధిలోని టేకులచెరువు సమీపంలో దోమలవాగును మినీ రిజర్వాయర్గా తీర్చిదిద్దాలని... అలా చేస్తే మండలంలోని టేకులచెరువు,లక్ష్మీపురం, సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లిబంజర్,అంజనాపురం,నకిరిపేట,గోపాలపురం,పోలవరం,కొమ్ము నకిరిపేట,వేపలగడ్డ పరిధిలోని 1405 ఎకరాల్లో 11 గ్రామాల రైతులకు లబ్దిచేకూరుతుందని ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లును స్థానిక కాంగ్రెస్ నేతలు,రైతులు మణుగూరులోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

దోమలవాగు చెరువుకు పై భాగాన సీతారామ ప్రాజెక్టు కాలువ పోతుండటంతో దోమలవాగు చెరువును అనుసంధానం చేస్తే 1405 ఎకరాల ఆయకట్టు బాగుపడుతుందని, సీతారామ కాలువ లింక్ ను ఈ చెరువుకు అనుసంధానం చేయాలని తద్వారా రైతులకు అన్నివిధాలుగా లబ్దిచేకూరుతుందని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని,అలాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని,రైతులకు మేలు చేసేందుకు త్వరలోనే దోమలవాగు వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతుల కోరికను నెరవేర్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

ఈ విషయంపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ,నాయకులు బాదం రమేష్ రెడ్డి,బాదం నాగిరెడ్డి,కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్,మందా నాగరాజు,బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,ఇంగువ రమేష్,కైపు లక్ష్మీనారాయణరెడ్డి,మాజీ సర్పంచ్ సర్పా వెంకటేశ్వర్లు,సపావత్ సీతారాం,తేజావత్ పున్న, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.