ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
టెల్ అవీవ్, అక్టోబర్ 22: లెబనాన్‌లోని హెజ్బొల్లా సంస్థ మూలాలను దెబ్బతీసే పనిలో ఉన్న ఇజ్రాయెల్ సైన్యం మరో కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్బొల్లా బంకర్లలో గుట్టలు గుట్టలుగా విదేశీ కరెన్సీ (అమెరికా డాలర్లు), బంగారం పోగుపడి ఉన్నదని ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి డేనియల్ హగరీ విడుదల చేశారు. బీరుట్ నడిబొడ్డున ఉన్న అల్ సాహెల్ దవాఖాన కింద హెజ్బొల్లాకు భారీ బంకర్ ఉన్నదని, అందులో దాదాపు రూ.4,200 కోట్లు, బంగారం ఉన్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. అయితే ఆ బంకర్‌పై దాడిచేయబోమని తెలిపారు.