లాహోర్: మీరు విన్నది నిజమే.. పాక్ ప్లేయర్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానం సంపాదించినందుకు 100 అమెరికన్ డాలర్లు (దాదాపు 28,000 పాక్ రూపాయలు) ఇవ్వనున్నట్లు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో కప్పును భారత్ కొట్టేయగా.. పాక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023లో ఫైనల్ చేరిన పాక్ ఈ సారి మాత్రం ఆ ఫీట్‌ను రిపీట్ చేయడంలో విఫలం అయింది. ఈ ప్రత్యేక బహుమతి గురించి పీహెచ్‌ఎఫ్ అధ్యక్షుడు మిర్ తారిఖ్ బుగ్టి ప్రకటించారు. తన తండ్రిని కోల్పోయినా కానీ జట్టుతోనే ఉన్న ఘజన్‌ఫర్‌కు ఈ కాంస్యపతకం అంకితం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాక టోర్నీ సమయంలో గాయపడిన అబూబకర్ మహ్మద్ కోలుకునే వరకు అతడికి కావాల్సిన సదుపాయాలను హాకీ ఫెడరేషనే కల్పిస్తుందని తెలిపాడు.