calender_icon.png 15 January, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

86 రూపాయిలకు 1 డాలర్

11-01-2025 12:00:00 AM

  1. ఆల్‌టైమ్ రికార్డు కనిష్టానికి దేశీయ కరెన్సీ 
  2. 86.౦4 వద్ద ముగింపు

ముంబై, జనవరి 10: రూపాయి చరిత్ర లో ఎన్నడూచూడని కనిష్ఠస్థాయికి పడిపో యింది. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు తరలించడం, డాలర్ బలోపేతంకావడం, ఇతర వర్థమాన కరెన్సీలు క్షీణించడంతో శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారె క్స్)డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 86 స్థాయి దిగువకు పడిపోయింది.

క్రితం ముగింపుతో పోలిస్తే మరో 1౮ పైసలు నష్టపోయి 86.౦౪ వద్ద ముగిసింది.  డాలర్ రెండేండ్ల గరిష్ఠస్థాయి వద్దకు చేరడం, క్రూడ్ ధరలు పెరగడం దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉం డటం, విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం కూడా రూపా యిని క్షీణబాటలో నడిపిస్తున్నదన్నారు.

డాలర్ ఇండెక్స్ 109.05 వద్ద కదులుతున్నది. ఫెడరల్ రిజ ర్వ్ వడ్డీ రేట్ల కోతలపై ఆచి తూచి వ్యవహరిస్తుందన్న అంచనాలతో యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ కూడా 4.70 గరిష్ఠస్థాయికి చేరింది. ప్రపంచ మార్కె ట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 79 డాలర్ల స్థాయిని అధిగమించింది.

విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఒక్కవారంలోనే  రూ.16,500 కోట్లకుపైగా పెట్టుబడుల్ని ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. సమీప భవిష్యత్తులో రూపాయి 85. 80 రేంజ్‌లో ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు.