calender_icon.png 20 January, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె కళ్ళు సజీవం

20-01-2025 02:02:02 PM

మరణానంతరం నేత్రదానానికి ముందుకు వచ్చిన డోలి కృష్ణవేణి కుటుంబ సభ్యులు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన డోలి కృష్ణవేణి అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో మృతి  చెందారు. కృష్ణవేణి భర్త డోలి సుధీర్  కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంతో ఉండి కూడా ఇద్దరు అందులకి కంటి చూపుని అందించాలనే ఉద్దేశంతో నేత్రదానానికి ముందుకొచ్చారు. నేత్రదాత కృష్ణవేణి మరిది జనహిత సభ్యులు డోలి సుకుమార్ జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ కు విషయం తెలపడంతో సదాశయా ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ సహకారంతో వాసన్ ఐ బ్యాంక్ కిరణ్  హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో కృష్ణవేణి కి సంబంధించిన నేత్రాలని సేకరించారు. నేత్రదాత దంపతులు డోలి కృష్ణవేణి-సుధీర్ దంపతులు తెలంగాణ మలి దశ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.

జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ గారు మాట్లాడుతూ డోలి కృష్ణవేణి మరణం బాధాకరమని పుట్టెడు దుఃఖంలోను ఇద్దరి అందులకి కంటి చూపు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేత్రదానానికి సహకరించిన కృష్ణవేణి భర్త డోలి సుధీర్, అతని పిల్లలు ధర్మ తేజ, స్మరణ్ తేజ తో పాటు అతని కుటుంబ సభ్యులకు  జనహిత సభ్యులు డోలి సుకుమార్, సదాశయా ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, వాసన్ ఐ బ్యాంక్ కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేత్ర దాత డోలి కృష్ణవేణి గారి స్పూర్తితో బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలు మరణానంతరం నేత్రాలని బూడిద పాలు చేయకుండా ప్రతి ఒక్కరు నేత్ర అవయవ దానంపై అవగాహన పెంచుకుని నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని కోరారు.