calender_icon.png 27 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల మందపై కుక్కల దాడి

05-11-2024 11:32:22 AM

తమను ప్రభుత్వంమే ఆదుకోవాలి.. కాపరి పుల్ల స్వామి యాదవ్

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండల్ కుర్మపల్లి గ్రామానికి చెందిన పుల్ల స్వామి గొర్రెల మందపై రాత్రి 12 గంటల సమయంలో కుక్కల మంద గొర్రెలపై విరుచుకుపడి 15 గొర్రెలను చంపితిన్నాయి. గొర్రెల కాపరి పుల్ల స్వామి మాట్లాడుతూ.. తన చుట్టుపక్కల ఉన్న కంపెనీలో పనిచేసే కార్మికులు తమకు నచ్చినప్పుడు, గొర్రెలను, కోళ్లను, తెచ్చుకుంటూ తింటూ, వాటి వ్యర్థ  పదార్థాలను, గొర్ల కొట్టాలలో వేయడం వల్ల కుక్కలు వచ్చి తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అట్టి కంపెనీలపైన తగు చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు.