జగిత్యాల, జూలై 31 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో డాగ్ స్కాడ్‌ను ఎస్పీ అశోక్‌కుమార్ బుధవారం సందరించి, జాగిలాల పనితీరు పరిశీలించారు. జిల్లాలో ఎన్నో రకాల కేసులను చేదించడంలో జాగిలాల పనితీరు ప్రశంసనీయమన్నారు. పోలీసు జాగిలాలను ఉపయోగించి మాదక ద్రవ్యాల ఉనికిని కూడా తెలుసుకోవచ్చన్నారు. జాగిలాల ఆహార, ఆరోగ్య నియమాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డాగ్ స్కాడ్ సిబ్బందికి సూచించారు. అనంతరం జాగిలాలు నుంచి ఎస్పీ గౌరవ వందనాన్ని సీకరించారు.