మందమర్రి,(విజయక్రాంతి): కార్మిక కాలనీ గుండా నడుచుకుంటూ వెళ్తున్న పాదయారిపై కుక్క కాటు వేయడంతో యజమానిపై కేసు నమోదైంది. వివరాలోకి వెళ్లితే... పట్టణంలోని ఒకటో జోన్ కు చెందిన బైరాజు పాపయ్య తన పని నిమిత్తం నడుచుకుంటూ వెళుతుండగా అదే కాలనీలోని తాటికొండ బెంజిమెన్ కు చెందిన పెంపుడు కుక్క కాటు వేసి గాయపరిచింది. కుక్క యజమాని నిర్లక్ష్యం మూలంగానే తమ తండ్రిని గాయపరిచిందని బాధితుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో పెంపుడు కుక్క యజమానిపై కేసు నమోదైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది