సిద్దిపేట, ఆగస్టు26 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో ఓ చిన్నారిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామంలో.. లాస్యదేవేందర్ దంపతుల కూతురు హన్సిక ఆదివారం తోటి పిల్లలతో కలిసి ఇంటిముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఓ కుక్కల గుంపు పిల్లలపై దాడి చేసేందుకు రాగా.. పిల్లలందరూ అక్కడి నుంచి పారిపోయారు. హన్సిక భయపడి అక్కడే ఉండిపోవడంతో కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి లాక్కెళుతుండగా స్థానికులు గమనించి వాటిని తరమడంతో పాపను వదిలి పారిపోయాయి. కుక్కల దాడిలో హన్సిక తలతో పాటు ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలింరు. ప్రస్తుతం హన్సిక తీవ్రగాయాలతో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జిల్లాలో కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయని.. కలెక్టర్ స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.