జనగామ మున్సిపాలిటీకి హైకోర్టు ప్రశ్న
జనగామ, సెప్టెంబరు 10(విజయక్రాంతి): జనగామ పట్టణ పరి ధిలో ఓ అక్రమ నిర్మాణంపై అధికారులు స్పందించకపోవడంతో జ నగామ మున్సిపాలిటీకి హైకోర్టు మొట్టికాయలు వేసింది. జనగామ కు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి పట్టణంలో ఖాళీ ఓ ప్లాటును కొ న్నాడు. దానిని ఆక్రమించి ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. దీనిపై మధుసూదన్ పది నెలల క్రితమే జనగా మ ఆర్డీవో, మునిసిపల్, కలెక్టర్ కా ర్యాలయాల్లో ఫిర్యాదు చేశాడు. ఎ వరూ పట్టించుకోకపోవడంతో హై కోర్టును ఆశ్రయించాడు. ఆక్రమణను ఎందుకు అడ్డుకోలే దో వివర ణ ఇవ్వాలంటూ మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హైకోర్టు ఈ నెల 6న నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై ఈ నెల 12న హైకోర్టులో వివరణ ఇవ్వాలని ఆదేశా లు జారీ చేసింది. కాగా మధుసూదన్ అనే వ్యక్తి నుంచి తనకు ఎలాంటి ఫిర్యా దు అందలేదని మునిసిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పది నెలల క్రితం తాను ఇక్కడ బాధ్యతలు స్వీకరించలేదని చెప్పారు.