calender_icon.png 11 January, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు అధికారం రాష్ట్రానికి ఉందా?

11-07-2024 02:32:47 AM

ఈ విషయాన్ని తేల్చుతామన్న హైకోర్టు

విజయవాడ, జూలై 10 (విజయక్రాంతి): భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ అయిన కొత్తలో టిక్కెట్ల రేట్లను పెంపుదల చేసే అధికారం రాష్ట్రానికి ఉందో లేదో తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. కల్కి సినిమాకు మొదటి పది రోజులు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే తరహాలో గతం లో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది. విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కల్కి సినిమా టిక్కెట్ ధరలను రెండు వారాల పాటు పెం చుకునేందుకు అనుమతినిస్తూ ప్ర భుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నెల్లూరుకు చెందిన రాకేశ్‌రెడ్డి పిల్‌పై విచారణ చేపట్టిం ది. గతంలో మొదటి 10 రోజులపాటు టిక్కెట్ ధరలను పెంచు కునేందుకు అనుమతినిచ్చిన ప్రభు త్వం.. ఇప్పుడు కల్కి సినిమాకు 14 రోజులకు ఎలా ఇస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.