కోనరావుపేట, జనవరి 20: నెలల తరబడి మురికి కాల్వల శుభ్రం చేయకపోవడం తో మురు గు నీరంతా చేరి దోమలకు నిలయం గా మారింది. కోనరావుపేట మండల కేంద్రం లో హెచ్ పి గ్యాస్ దగ్గర ఉన్న చర్చి సమీపంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్నా మురికి నీరంతా బయటకు పోకుండా నిల్వ ఉండడంతో దుర్వాసన తో పాటు రోగాలబారినపడుతున్నారు. పలుమార్లు అధికా రులు విన్నవించిన పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి మురుగు నీరు శుభ్రం చేయించాలని కోరుతున్నారు.