calender_icon.png 16 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరాబాయి మెరిసేనా?

07-08-2024 03:51:44 AM

  1. నేడు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 
  2. గోల్ఫ్ బరిలో దీక్షా, అదితి

పారిస్: భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సికోమ్ నేడు మహిళల 49 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా మంచి అంచనాలున్నాయి. కచ్చితంగా పతకం రంగు మారుస్తుందని అంతా ఆశిస్తున్నారు. 12 మంది బరిలోకి దిగనుండగా.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో అత్యధిక బరువు ఎత్తిన టాప్ ఆటగాళ్లను విజేతలుగా నిర్ణయించనున్నారు.

ఇక మహిళల గోల్ఫ్ విభాగంలో అదితి అశోక్, దీక్షా డాగర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో అదితి తృటిలో పతకం చేజార్చుకుంది. ఆ పొరపాటును పునరావృతం చేయకూడదనే పట్టుదలతో ఉంది. మరోవైపు కారు ప్రమాదం నుంచి బయటపడిన దీక్షా ఈసారి పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది.