calender_icon.png 31 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు మంత్రివర్గ ఆమోదం ఉందా?

01-09-2024 01:34:16 AM

  1. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దు 
  2. బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి):  హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్  దెబ్బ తీసే ప్రయత్నాలు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకే శ్ రెడ్డి హెచ్చరించారు. కూల్చివేతలతో  రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేసి పెట్టుబడులను అమరావతికి మళ్లించడమే రేవంత్ రెడ్డి లక్ష్యం పెట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏమిటి? దానికి మంత్రివర్గ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు, అనుమతులు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ కూల్చివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగ రంలో పేదల ఇండ్ల జోలికి వస్తే సహించబోమన్నారు. అక్రమ కట్టడాలు, కబ్జా స్థలాలు రికవరీ చేయాలని, పేదల గూడు చెదరగొట్టొద్దని సూచించారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాని, హైడ్రాతో చేస్తున్న హైడ్రామాకు తాము వ్యతిరేకనమ్నారు. పేదల ఇండ్లను కూలుస్తూ సీఎం సోదరుడికి, ఇతర బడాబాబులకు మాత్రం ముందస్తు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. 

సీఎం  కుటుంబానికి ఒక రూల్.. పేదలకు ప్రజలకు మరో రూల్ ఉంటుందా అని నిలదీశారు. జులైలో ఏర్పాటైన హైడ్రా నెల రోజుల్లోనే  హైద్రాబాద్‌లో ఉన్న చెరువులు, కుంటల ఆక్రమణలపై సర్వే ఎప్పుడు చేసిందని నిలదీశారు.  రాత్రికి రాత్రే పుట్టిన హైడ్రాను రాజ కీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఒక ఐఏఎస్ అనుమతి ఇస్తే మరో ఐపీఎస్ వచ్చి కూల్చుడమేమిటన్నా రు. పేదల ఇండ్ల మీదకు రేవంత్ రెడ్డి బుల్డోజర్స్ దూసుకెళ్తున్నాయన్నారు. హస్మత్ పేట, అల్వాల్, సరూర్‌నగర్, బోయిన్‌బల్లి, రాజీవ్‌నగర్, ఖాజాగూడలో ఇండ్లకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చి  ఇప్పుడు  ఎందుకు కూల్చివేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

పెట్టుబడులు అమరావతికి..

నగరంలో సుమారు 30 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. కాంగ్రె స్ వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. పట్టా భూముల్లో రెవెన్యూ, ఇరిగేష న్, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలు ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చి  రాత్రికి రాత్రే కూల్చేయడానికి మించిన తుగ్లక్ చర్య ఉండదన్నారు. కాంగ్రెస్ పాలనలో పి.జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులు పేదల ఇండ్ల పట్టాల కోసం కృషి చేశారని,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, ఇపుడు రేవంత్ రెడ్డి ఆ ఇండ్లను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి,పెట్టుబడులను అమరావతికి తరలించడానికి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తక్షణమే హై డ్రా విధివిధానాలు రూపొందించి  కూల్చివేతలు ఆపి వేయాలని డిమాండ్ చేశారు.