- బీసీ కులగణనపై ఆ పార్టీ వైఖరి చెప్పాలి
- కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌ను ఎందుకు నిలదీయడం లేదు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బీ సీలంటే బీజేపీకి లెక్కలేదా? అని, బీసీ కులగణనపై తమ వైఖరేంటో ఆ పార్టీ చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయ డం లేదని ప్రశ్నించారు. గురువారం కుమ్మరి సం ఘం నేతలు కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాలా మద్దతిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తోందని మండిపడ్డారు. బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసింద ని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభు త్వం విస్మరిస్తున్నా.. బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు.
బీసీలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు అవ్వడం బీజేపీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తా త్సారం చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందని, కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే బీసీలపై ప్రేమ లేనట్టేనని మనం అర్థం చేసుకోవాలన్నారు. సమావేశంలో శాలివాహన, ఆరెకటిక సంఘం నాయకులు పాల్గొన్నారు.