న్యూయార్క్: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి నేటి నుంచి న్యూయార్క్ వేదికగా మొ దలుకానున్న వరల్డ్ ర్యాపి డ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీ లో బరిలోకి దిగనున్నా డు. 2026 క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్‌ను సాధించేందుకు అర్జున్‌కు ఇది మంచి అవకాశం. ప్రస్తుతం అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరూనా తర్వాతి స్థానంలో అర్జున్ కొనసాగుతున్నాడు. ఓపెన్ కేటగి రీలో అర్జున్‌తో పాటు ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వా నీ, అరవింద్ చిథంబరం పోటీ పడనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, ఆర్. వైశాలీ, దివ్య దేశ్‌ముఖ్ ఆడనున్నారు.