calender_icon.png 26 November, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెయిరీ కళాశాలకు దొడ్ల 4కోట్ల విరాళం

26-11-2024 02:08:28 AM

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి దొడ్ల డెయిరీ యాజమాన్యం రూ.4కోట్ల విరాళం ప్రకటించింది. సచివాలయంలో దీనికి సంబంధించిన ఆమోద పత్రాన్ని ఆ సంస్థ సీఈవో బీవీకెరెడ్డి విశ్వవిద్యాలయ కులపతి, పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌కు సోమవారం అందించారు.

ఈ సందర్భంగా దొడ్ల డెయిరీ యాజమాన్యంతోపాటు చైర్మ న్ సునీల్‌రెడ్డిని ఘోస్ అభినందించారు. అనంతరం దొడ్ల డెయిరీ సీఈ వో బీవీకే రెడ్డి మాట్లాడుతూ.. ఈ విరాళంతో కళాశాల భవనానికి మరమ్మతు లు, మొదటి అంతస్తు నిర్మాణం, ఎన్‌హెచ్ నుంచి కళాశాల వరకు, కళాశాల నుంచి బాలుర, బాలికల హాస్టళ్ల వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణం, మినీ డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులకు సంబంధిం చిన వివరాలను తెప్పించి విశ్వవిద్యాలయ ఆమోదం ఇవ్వాలని రిజిస్ట్రార్ శరత్‌చంద్రను ఘోష్ ఆదేశించారు.