calender_icon.png 10 April, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

04-04-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్ ఏప్రిల్ 3: భూస్వాములు, దొరల అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య హాజరై దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసముందని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.