04-04-2025 01:21:34 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి ): దొడ్డి కొమరయ్య జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జీవితం మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, వారు అతి పేద కుటుంబం నుండి రైతాంగ సాయుధ పోరాటానికి నైజాం ప్రభుత్వంలో ముందుండి పోరాడారని, వారి పోరా టాన్ని నేటి తరానికి తెలియజేసి వారి జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటే ఎంత అప జయాన్ని అయిన సాధించ వచ్చని, భవిష్యత్తులో బావి తరాల పౌరులుగా నిలుస్తారన్నారు.
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో నైజాం ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటంలో నిలిచారన్నారు. స్వాతంత్రం రావడానికి వారు ఎన్నో పోరాటాలు చేసి వారు బాధ్యత వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, బిసి సంక్షేమ అధికారి యాదయ్య, ఎస్సీ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, స్టేట్ టిజేఏసీ ట్రెజ రర్ మందడి ఉపేందర్ రెడ్డి , కుల సంఘ నాయకులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు